Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
మండలాన్ని అన్నివిధాలుగా అభివద్ధి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు.సమావేశానికి హాజరుకాకుండా ఉండే అధికారులు తీరు మార్చుకోవాలన్నారు.స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కషి చేస్తుందన్నారు.విద్యుత్ శాఖాధికారులపై ఎమ్మెల్యే గరం అయ్యారు.గ్రామాల్లో కరెంట్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.గ్రామాలను అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు.గ్రామాల్లో మౌలికసదుపాయాల కల్పనకు కషి చేస్తానని తెలిపారు.అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పనుల్లో అధికారులు అలసత్వం వహించొద్దన్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో సురక్షిత తాగునీటినందించడం జరుగుతుందని గుర్తు చేశారు.ఎంపీపీ కొండూరి భవాని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ కంకణాల ప్రవీణవెంకట్ రెడ్డి, ఎంపీడీఓ రాజు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గున్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, పున్రెడ్డి సుమతిరెడ్డి, ఉజ్జిని లక్ష్మి సాగర్‌రావు, కొండూరి శ్రీదేవి శ్రీనివాస్, రమావత్ సుజాత కొండల్నాయక్, ఉడుత అఖిలయాదవ్, కేశగోని రవీందర్‌గౌడ్, దండేటికార్ లలితబాయి మోహన్, వస్కుల చంద్రకళ భారతయ్య, కాయితి జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు కుంభం శ్వేత శ్రీశైలంగౌడ్, ఎల్లంకి వరలక్ష్మి, పోగాకు శ్రీశైలం పాల్గొన్నారు.