Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి బస్టాండ్ వరకూ ఎడ్లబండిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ప్రదర్శించి నిరసన తెలిపారు. స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఉన్నరాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్డీవో రోహిత్ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తిగా తగ్గిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోనున్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పైసల చొప్పున పెంచిందని, దానికి బీజేపీ వాళ్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రూపాయలలో పెంచుతుందని ఆరోపించారు. దీని వల్ల సామాన్య, పేద తరగతి ప్రజలపై భారం పడుతుందని వాపోయారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మెన్ బాలునాయక్, సిరాజ్‌ఖాన్, ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
దేవరకొండ : పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నియంత్రించాలని మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టిన సైకిల్ ర్యాలీ నిరసన కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలో సైకిల్ ర్యాలీ, ఎడ్లబండి లాగుతూ నిర్వహిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకూ ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి సిరాజ్ ఖాన్, చింతపల్లి ఎంపీపీ భవాని పవన్‌కుమార్, మాజీ మార్కెట్ చైర్మెన్ ముక్కమల్ల వెంకటయ్యగౌడ్, మండలఅధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి, లోకసానికష్ణయ్య, గోవర్ధన్, జిల్లానాయకులు వైస్.కర్నాకర్, పట్టణ అధ్యక్షులు యూనుస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర రావు, మాజీ జెడ్పీటీసీ హరినాయక్, శ్రీను ఉన్నారు.
మర్రిగూడ: మండలకేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు పొనుగోటి విజయరామారావు, మాల్ మార్కెట్ మాజీ చైర్మెన్ పాల్వాయి అనిల్‌రెడ్డి ,కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మార్నేని ఏర్థయ, మాధగోని శేఖర్,నక్కతిరుపతయ్య, దండేటికర్ మల్లికార్జున్, శ్రీనునాయక్, యూసూబ్ పాల్గొన్నారు.
మోతె: మండలకేంద్రానికి సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద ఖమ్మం-సూర్యాపేట రహదారి మార్గంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐయూడబ్య్లూసీ జిల్లా ఐటీ సెల్చైర్మెన్ దోసపాటి చిరంజీవి,నాయకులు గుణగంటి వీరభద్రం, బొడ్డు నర్సయ్య, వెంకన్న పాల్గొన్నారు.