Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనితీరుపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మండలంలోని ధోని పాముల ,బంగారిగడ్డ, చండూర్ మున్సిపాలిటీ ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామాలలో హరితహారం మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కల పై బాధ్యతగా పెంచాలని సూచించారు. చండూర్ మున్సిపాల్టీలో పనితీరుపై ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. ఏడవ వార్డు లో అయిన మొక్కలు నాటారు. చండూర్ లో %=డదీ% రోడ్డులో మెయిన్ డ్రనేజి మరియు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బాగా డ్యామేజ్ కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని కలెక్టర్ దష్టికి చైర్పర్సన్ తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే ఇట్టి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అట్టి మరమ్మతులకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకట్రామ్ గారు వైస్ చైర్ పర్సన్ దోటి సుజాత వెంకటేష్ కౌన్సిలర్లు కోడి వెంకన్న కొన్ రెడ్డి యాదయ్య చిలుకూరి రాధిక శ్రీనివాస్ గుంటి వెంకటేశం, కో ఆప్షన్ సభ్యులు రావిరాల నగేష్, %వీణ% కైరు బేగం, %Aజు% రమేష్ మున్సిపల్ అధికారులు మేనేజర్ గిరిజ సీనియర్ అసిస్టెంట్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.