Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థినులకు అందజేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయిస్తూ వాటిని బలోపేతం చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గురుకుల పాఠశాలను మంజూరు చేయించి విద్యార్థులకు ప్రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సలీంషరీఫ్, ఎంపీపీ కవితా రాధారెడ్డి, జెడ్పీటీసీ కృష్ణకుమారిశేషు, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు చందు నాగేశ్వర్రావు, కౌన్సిలర్ సూర్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు శివకుమారి, నాయకులు సత్తి బాబు, వెంపటి మధు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, కోట మధుసూదన్, స్వామి నాయక్, మేదర లలిత, బత్తుల ఉపేందర్, మాదాల ఉపేందర్, అభి తదితరులు పాల్గొన్నారు.