Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర అధ్యక్షులు మందుల విప్లవ్‌కుమార్
నవతెలంగాణ-తిప్పర్తి
ఆగస్టు 1,2వ తేదీల్లో చిట్యాల మండలకేంద్రంలో నిర్వహించనున్న డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మందుల విప్లవ్‌కుమార్ పిలుపునిచ్చారు.మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన మండలమహాసభలో ఆయన మాట్లాడారు.మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 400మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరవు తున్నారన్నారు. మహాసభలకు అన్ని విధాలుగా సహకరించి జయప్రదం చేయాలని కోరారు.ఉగ్రవాద బాంబు దాడులు పేలుళ్ల బాధితులను ఆదుకోవడంలో,ప్రకతి విపత్తులు సంభవి ంచినప్పుడు సహాయ కార్యక్రమాలలో తమ సంఘం ముందుందన్నారు.ఆధునిక సమాజమంతా కాలుష్యం విస్తరిస్తున్న ఈ పరిస్థితుల్లో ''మొక్కలు నాటండి-ఆక్సిజన్‌ను ఆస్తిగా ఇవ్వండి అంటూ లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించిందన్నారు.నల్లమల్ల అడవుల విధ్వంసం చేసే కుట్రలను తిప్పికొట్టడంలో కీలకంగా ఉండి దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం నడిపిందన్నారు.అందరికీ విద్య ,ఉపాధితోనే దేశాభివద్ధి సాధ్యమని కోరుతుందన్నారు.ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఖాళీగా ఉన్న 60లక్షలు కూడా భర్తీ చేయకుండా యువతను మోసం చేస్తుందన్నారు.ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతూ కులం ,మతం, జాతి పేరుతో ఉన్మాదాలను పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. ప్రజా స్వామ్యాన్ని ,సెక్యూలరిజాన్ని దెబ్బతీస్తూ రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీసే చట్టాలు చేస్తుందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల నియామకాల ఆశలను ,ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.1.91లక్షల ఖాళీలతో అలానే ఆఫీస్‌లు బోసిపోయి ఉన్నాయన్నారు.టీఎస్పీఎస్సీ ఓటీఆర్‌లో 28 లక్షల మంది నమోదు చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారన్నారు. నిరుద్యోగ భతి ప్రకటనలకే పరిమితమైంది తప్ప మార్గదర్శకాలులేవన్నారు.ఖాళీల భర్తీకి అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.కరోనా కాలంలో దాదాపు పది లక్షల విలువైన సహాయ కార్యక్రమాలు చేసి పేదలకు తోడుగా నిలిచిందన్నారు. ఐసోలేషన్ సెంటర్లలో కరోనా రోగులకు ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించిందన్నారు.అలాగే ప్రభుత్వ వైద్యం బాగు చేయాలని, ప్రైవేట్ హాస్పిటల్స్ శవాల మీద పేలాలేరుకున్నట్టు అధిక ఫీజుల దందాపై కదం తొక్కిందన్నారు.ఇవే కాకుండా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు ,శ్రమదానాలు, మోడల్ టెస్ట్‌లు, కోచింగ్ సెంటర్స్ లాంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందన్నారు.ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధానకార్యదర్శి మల్లం మహేష్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవినాయక్, కోట్ల అశోక్‌రెడ్డి, జన విజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్నె భిక్షం, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకర్, సీఐటీయూ మండలకన్వీనర్ భీమగాని గణేష్ ,నాయకులు పోకల శశిధర్,పతాని శ్రీను, శ్రీనివాసాచారి, షరీఫ్, సైదులు, శివ, శ్రీకాంత్, శంకర్, భిక్షం, పరుశరాములు పాల్గొన్నారు.