Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందంపేట
గ్రామాల సమగ్ర అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం నేరడుగొమ్ము మండలకేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లా డారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సర్వతోముఖాభివద్ధి చెందుతు న్నాయన్నారు.పల్లెలన్ని ప్రగతిపథంలో పయనిస్తు న్నాయన్నారు.అధికారులు పూర్తి సమాచారంతో సమా వేశానికి హాజరుకావాలన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.వివిధ శాఖలకు సంబంధించి ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు సమస్యలపై పరిష్కారం చూపు తామన్నారు.ఎంపీపీ బాణావత్ పద్మహన్మనాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ శిరందాసు లక్ష్మమ్మకష్ణయ్య, జెడ్పీటీసీ కేతావత్ బాలునాయక్, పీఏసీఎస్ చైర్మెన్ ముక్కమల్ల బాలయ్య,వైస్ ఎంపీపీ అరేకంటి ముత్యాలమ్మరాములు,ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మ,తహసీల్దార్ సీతామహాలక్ష్మీ, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య పాల్గొన్నారు.