Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి
- మృతులో ఇద్దరు చిన్నారులు, ఇంటర్ విద్యార్థి
- భువనగిరిలో ఇద్దరు, సంస్థాన్‌నారాయణపురంలో మరొకరు
నవతెలంగాణ -భువనగిరిరూరల్/సంస్థాన్ నారాయణపురం
యాదాద్రిభువనగిరి జిల్లాలోని భువనగిరి, సంస్థాన్‌నారాయణపురంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు జల సమాధి అయ్యారు. భువనగిరి మండలం బస్వాపురంలో ఈత కోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, హైదరాబాద్ నుంచి సంస్థాన్‌నారాయణపురం రాచకొండ గుట్టల వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ యువకుడు చెరువులో ఈద కొట్టేందుకు దిగి మృతి చెందాడఔు.
ఈత కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థుల మతి చెందిన సంఘటన యాదాద్రిభువనగిరిజిల్లా మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్‌కు చెందిన సింగిరెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి (14), హనుమాన్ వాడకు చెందిన ఆంజనేయులు కుమారుడు హేమంత్ (15) పట్టణంలోని స్థానిక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు లేకపోవడంతో సరదా కోసం స్నేహితుల బర్త్‌డే ఉందని చెప్పి విద్యార్థులు హేమంత్, పవన్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వీరిద్దరూ కలిసి తమ స్నేహితులు ఆరుగురుతో కలిసి సోమవారం మధ్యాహ్నం సమయంలో భువనగిరి మండలం బస్వాపురం గ్రామ శివారులో ఉన్న రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. రిజర్వాయర్‌లో కింది భాగంలో ఉన్న నీటికుంటలోకి (గతంలో బస్వాపురం చెరువు) దిగారు. చాలాసేపటి వరకు రిజర్వాయర్ వద్దనే ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇందులో హేమంత్ పవన్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లలేదు.
రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన
హేమంత్, పవన్ కుమార్ రెడ్డి సాధారణంగా ఎక్కడికి వెళ్ళిన ప్రతి రోజు రాత్రి 8 గంటల వరకు ఇంటికి చేరుకునే వారు. కానీ ఆ రోజు రాత్రి ఎన్ని గంటలు దాటిన ఇంకా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రి పది గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడంతో కాలనీలో చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పవన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రిజర్వాయర్ వద్దకు వెళ్లామని చెప్పడంతో...
చీకటి పడిన ఇంకా ఇంటికి రాకపోవడంతో పిల్లల కోసం వారి తల్లిదండ్రులు వెళుతున్న క్రమంలో తాము బస్వాపురం రిజర్వాయర్ వద్ద ఎనిమిది మంది స్నేహితులతో కలిసి వెళ్లామని, ముందే ఇంటికి వచ్చా మంచి స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పారు. జరిగిన విషయం రూరల్ పోలీసులకు చెప్పడంతో తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో రిజర్వాయర్ వద్దకు పోలీసులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అక్కడ మతుల చెప్పులు ఉండడంతో ఇందులో మునిగిపోయి ఉంటారని భావించారు.
స్వయంగా వెతికిన రూరల్ ఎస్ఐ సైదులు...
హేమంత్, పవన్ కుమార్ రెడ్డిలను వెతకడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రూరల్ ఎస్ఐ సైదులు స్వయంగా నీటికుంతలోకి దిగి వెతికాడు. ఇద్దర్ని బయటికి తీశాడు. పోస్టుమార్టం నిమిత్తం భువనగిరిఏరియా ఆస్పత్రికి తరలించారు. నీటికుంతలోకి దిగి వారి ఆచూకి కనుగొన్న ఎస్సైనీ, ఆయన చూపిన తెగువను పలువురు అభినందించారు.
ఒక్క కొడుకు మతి చెందడంతో..
పట్టణంలోని కిసాన్ నగర్లో నివాసముంటున్న సింగిరెడ్డి విశేష రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి 10 సంవత్సరాల క్రితం రాజపేట మండలం బేగంపేట నుంచి భువనగిరి ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు ఒక పాప, కుమారుడు పవన్ కుమార్ రెడ్డి(14) ఉన్నారు. స్థానిక గంజ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఒకే కుమారుడు కావడంతో అతని ఇంట్లో ప్రేమగా చూసుకునే వారు ఒక్కసారిగా జరిగిన సంఘటనతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
మేస్త్రి పని చేస్తూ....
పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన లింగాల ఆంజనేయులు మేస్త్రి పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఆంజనేయులు అతని భార్య శ్యామలతో పాటు ఇద్దరు కుమారులు, ఒక పాప ఉన్నారు. తన ముగ్గురు సంతానాన్ని చదివిస్తున్నారు పెద్ద కుమారుడైన హేమంత్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెద్ద కుమారుడు ఉన్నతగా చదివించడం కోసం కుటుంబ సభ్యులు కష్టపడేవారు. ఇంతలోనే కొడుకు మతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆస్పత్రి వద్ద ధర్నా...
బస్వాపురం రిజర్వాయర్‌లో గతంలో కూడా నీటికుంటలో పడి పలువురు మత్యువాత పడినా ప్రాజెక్టు నిర్వాహకులు జిల్లా అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద సీపీఐ(ఎం), కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పట్టణ ఎస్ఐ సుధాకర్ ధర్నావద్దకు చేరుకుని శాంతింప చేసేందుకు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విహార యాత్రకు వచ్చిన విద్యార్థుల్లో ఒకరు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన మంగళవారం సంస్థాన్‌నారాయణపురంలోని రాచకొండ గుట్టల్లో చోటుచేసుకుంది. ఎస్సై చందా సుధాకర్‌రావు వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చంద్రయాన్ గుట్ట ప్రాంతానికి చెందిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు విహారయాత్ర కోసం రాచకొండకు వచ్చారు. రామాలయం గుడి ప్రాంతంలో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఇందులో సోయాబ్ (18) అనే విద్యార్ధి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.