Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైకమార్గమని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బోళ్ల నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు అన్నారు. మంగళవారం మండలంలోని కొప్పోలు గ్రామంలో పార్టీ శాఖ మహాసభ నిర్వహి ంచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం మోపుతున్నాయని విమర్శించారు. గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెంచాయని విమర్శి ంచారు.నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని, ఇలాంటి సమయంలోఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకపోవడం దారుణమన్నారు.పైగా ప్రజ లపై పన్నులరూపంలో భారాలు మోపు తుండడం సరికాదన్నారు.అనంతరం శాఖ కార్యదర్శిగా కర్ర బాలయ్య ను సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్థు మారయ్య,బోళ్ల జానకమ్మ, శ్రీపతి వెంకన్న, మండల యాకోబు, జటంగి వెంకన్న, నూకబత్తిని వెంకటయ్య, సీహెచ్.హరీష్, మండలశ్యామ్, కె శశాంక్ పాల్గొన్నారు.