Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి స్ఫూర్తితో సామాజికసేవల్లో రాణింపు
- ఆయన సేవలకు ఃచల్లాఃంగ ఉండాలంటున్న జనం
- నేటి యువతకు ఆదర్శం లక్ష్మీకాంత్
- మంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చల్లా లక్ష్మీకాంత్
నవతెలంగాణ-సూర్యాపేట
ఆయన ఓయువజన విభాగం నాయకుడు. సేవల్లో ఇతరులకు ఆదర్శప్రాయుడు.అందులోనూ నిరాశ్రయులు, నిరుపేదలు,వృద్ధుల జీవన విధానశైలిని మెరుగు పరచడమే లక్ష్యంగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.అందరూ బాగుండాలి అందులో మనముండాలనే కోణంతో నిరంతర సేవకుడిగా జిల్లాలో పేరుగాంచాడు.ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు.అంటే దానికి బలమైన కారణమే ఉందంటున్నారు.సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన చల్లా లక్ష్మీకాంత్. ప్రస్తుతం ఆయన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా, టీఆర్ఎస్ జిల్లా నాయకులుగా కొనసాగుతున్నారు.తన అభిమాన నాయకుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివద్ధి ప్రదాత, సూర్యాపేట సూరీడు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకల సంధర్భంగా నవ తెలంగాణతో చల్లా పలు అంశాలను పంచుకున్నారు.
బడుగు,బలహీనులపై మంత్రి జగదీశ్‌రెడ్డి కొన్నేండ్లుగా చూపుతున్న చొరవ,కృషి పట్టుదల పని మంత్రి అడుగుజాడల్లో నడిచే విధంగా ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారని,అందులో తాను కూడా ఒకడినని చెప్పారు.ఆయన పూర్తి ముందు తరాలకు ఆదర్శప్రాయమైందని తెలిపారు.అవే తనని చీకట్లో మగ్గుతున్న నిరుపేదల జీవితాల వైపు మళ్లించారని గుర్తుచేశారు.మానవ ప్రయాణం కొన్నేండ్ల పాటు మాత్రమే ఉంటుందని, ఆ ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఒడుదొడుకులు సహజమన్నారు.అట్టి ఒడిదుడుకుల్లోనూ బడుగు,బలహీనులు ప్రయాణం చేయాలంటే ఆర్థికంగా, బలోపేతంగా ఉన్న వ్యక్తుల సహాయం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు.అందులో భాగంగానే తనకు ఉన్న సంపాదనలో ఎంతోకొంత నిరాశ్రయులకు చేయూత నివ్వాలనే సంకల్పం కల్పించిందన్నారు. సమయం వచ్చినప్పుడల్లా తనకు తోచిన విధంగా వృద్ధులు, నిరాశ్రయులు, చిన్నారులు, పేద విద్యార్థిని, విద్యార్థులకు వివిధ సేవ కార్యక్రమాల ద్వారా సహాయం అందజేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రశంశలు...
వాసవిక్లబ్,ఆర్యవైశ్య కమిటీ,లయన్స్ క్లబ్, జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యులుగా ఉంటూనే తనదైన శైలిలో సేవలను అందించారు.వీటితో పాటు పలు దేవాలయాల్లో ట్రస్ట్‌బోర్డు సభ్యుడిగా కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాలుగేండ్ల కింద హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య,నాటి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మెన్ స్వామి గౌడ్,ప్రస్తుత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా పలు సందర్భాల్లో ఈ అవార్డులు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు.2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా నాటి సూర్యాపేటకలెక్టర్ సురేంద్రమోహన్ చేతుల మీదుగా ఉత్తమ యువజన సేవకుడిగా అవార్డు అందుకున్నారు.అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందుకున్న వ్యక్తులలో తాను ఒకరు కావడం విశేషం.
సేవల్లో ఆదర్శప్రాయుడు..
సూర్యాపేట జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు యువకుల కోసం మధ్యాహ్నం భోజనం చేయడానికి వీలుగా మొత్తం రూ.లక్షతో షెడ్డు నిర్మించారు.అందులో రూ.60 వేలు తన వ్యక్తిగతంగా అందజేయగా, మిగిలిన రూ.40 వేలు దాతలసహాయంతో నిర్మింపజేశారు.అక్కడే విద్యార్థులకు అవసరమైన పుస్తకాల కొనుగోలు కోసం రూ. 10,000 అందజేశాడు.సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని దురాజ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ప్లేట్లు, దుప్పట్లు, పంపిణీ చేశారు. మంచినీటి వసతికల్పన కోసం రూ.20 వేలు అందించారు.ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో 40 రోజుల పాటు అల్పాహారం అందజేశారు.పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, ప్రెస్ క్లబ్, జూనియర్ కళాశాల, జవహర్ బాల కేంద్రం, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పరిసర ప్రాంతాల్లోనూ,అనాధ,వద్ధాశ్రమాల్లోనూ సుమారు 500 పైగా సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. సేవ భారత అవాసంలో అనాధ పిల్లలకు మరుగుదొడ్ల నిర్మాణం,గ్యాస్ సిలిండర్లు, దుస్తులు,పుస్తకాలను పంపిణీ చేశారు. అపూర్వ బధిరుల పాఠశాల భవనానికి కొంత ఆర్థిక చేయూతనిచ్చారు.కుడకుడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల తరగతి గదికి ఇనుప కుర్చీలు, నోట్ పుస్తకాలు అందజేశారు.జీవనోపాధి పొందుతున్న మరి కొంతమంది పేద మహిళలకు గ్రైండర్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.పలు పాఠశాలల్లో విద్యార్థులకు వారిలోని సజనాత్మకతను వెలికితీసేందుకు పలురకాల క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు.
పదవులకే వన్నె తెచ్చారు...
ఐదేండ్లుగా వివిధ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా తనదైన శైలిలో పాల్గొంటూనే వివిధ పదవులను అనుభవించారు.ఆ పదవుల్లో ఆయన తన చతురతతో ఒదిగిపోయారు.గతంలో జిల్లా గ్రంథాలయ కోశాధికారిగా, వాసవి క్లబ్ అధ్యక్షుడిగా, వాసవీ క్లబ్ డిప్యూటీ గవర్నర్ గా, ఎన్నో విశిష్ట సేవలు అందుకున్న ఆధ్యాత్మికంగా పలు దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా,గౌరవ సలహా దారుగా, సహాయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పదవులను అలం కరించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు సూర్యాపేట జిల్లా యువజన అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.