Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును నాసిరకంగా నిర్మించడం వల్ల స్లాబ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి.ప్రారంభోత్సవానికే ముందే ఇండ్ల స్లాబ్‌కు పగుళ్లు రావడం ఏంటని గ్రామస్తులు వాపోతున్నారు. మండలపరిధిలోని బీక్యాతండాలో నాలుగేండ్ల నుండి 50 డబుల్బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తుంది.వీటి నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చింది.కానీ అరకొర పనులు పెండింగ్‌లో ఉన్నాయి.కాంట్రాక్టర్ నాసిరకంగా ఇండ్లను నిర్మించడం వల్ల స్లాబులకు పగుళ్లు వచ్చాయి. కాళ్లతో కదిలిస్తే పెచ్చులు ఊడిపోతున్నాయి.ఇప్పటికైనా అధికా రులు స్పందించిన నాసిరకంగా ఇండ్లను నిర్మించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, పగుళ్లు వచ్చిన స్లాబ్లకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయిస్తాం
ఏఈ లక్ష్మారెడ్డి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించాం ఇంకా చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి.స్లాబ్‌పైన సిమెంట్ వేయకపోవడం వల్ల పగుళ్లు వచ్చి ఉంటాయి.వాటిని కూడా సరి చేయిస్తాం.