Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
కృష్ణా, గోదావరి నదీజలాల సమస్యపై కేంద్రం అతి జోక్యంతో రెండు రాష్ట్రాలలో ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన ప్రాజెక్టులు తన పరిధిలోకి తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, వాటిని తామే నిర్వహిస్తామని ప్రకటించడం విస్మయానికి గురిచేస్తున్నదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి విమర్శిం చారు.మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ శాఖా మహాసభలో ఆయన మాట్లాడారు.ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఆసరాగా చేసుకుని కేంద్రం పెత్తనంచేయడం రాష్ట్రాల హక్కులను కాల రాయడ మేనన్నారు. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయం, సహకారం, విద్య, మరికొన్నింటిని కేంద్రం తనచేతిలోకి తీసుకుందని చెప్పారు.రాష్ట్రాలపై మరింత పెత్తనం చేసే ఈ చర్యను పార్టీ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. నదీజలాల విషయంలో ఇరు రాష్ట్రాలు గొడవపడితే అవసరమైన కమిటీలు, ట్రిబ్యునల్స్ లేదా స్టాండింగ్ఆర్డర్స్ అమలుచేయాలని డిమాండ్ చేశారు.రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరించాలి తప్ప పంచాయితీ తీర్చమని కోరితే హక్కులను గుంజుకుని అధికారం చెలాయిస్తామన్న కేంద్రప్రభుత్వ విధానం ఫెడరల్ హక్కులకు భంగం కలిగించేలా ఉందని కేంద్రం తీర్పును తప్పుబట్టారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు రవినాయక్,మండల కార్యదర్శి వినోద్ నాయక్, సీనియర్ నాయకులు పాపానాయక్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పతాని శ్రీను, సీఐటీయూ మండలకార్యదర్శి దయా నంద్,నాయకులు సైదులు,ఖాజామోయినుద్దీన్,గోపి, సుబాని పాల్గొన్నారు.