Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజరు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో పాటు అవినీతిని ప్రశ్నిస్తూ ఆగస్టు 9 నుండి బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు తెలిపారు. ఆదివారం యాదరగిరిగుట్టలో నిర్వహించిన కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు . రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందన్నారు. మద్దతు ధర కోసం ఐకేపీ కేంద్రాలను సందర్శించిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిందన్నారు. మహా పాదయాత్రకు రైతాంగం అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలుచేయాలని ,నకిలీ విత్తనాలు అరికట్టాలని ,రైతులకు తక్షణం రుణ మాఫీ ,అమలు చేయాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి బండ్రు శోభారాణి ,జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి ,నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ,జగన్ మోహన్ రెడ్డి ,రచ్చ శ్రీనివాస్ , కాదురి అచ్చయ్య ,భువనగిరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి సందర్శించిన బండి సంజరు
లక్ష్మీ నరసింహ స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ఆదివారం దర్శించుకున్నారు .ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు .ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు .ఆయన వెంట రాష్ట్ర జిల్లా స్థానిక బిజెపి నాయకులు ఉన్నారు.