Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నాయని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ధీరావత్ రవినాయక్ విమర్శించారు.ఆదివారం పట్టణ ంలో జరిగిన మూడవ శాఖ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలకులు పూర్తిస్థాయిలో పెట్టుబడిదారీ విధా నాలను అమలు చేస్తూ ప్రజల స్థితిగతులను పట్టించుకోకుండా పన్నుల రూపంలో ప్రజలను పిలుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.పట్టణంలోని బైపాస్రోడ్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో స్థానిక రైతులకు పంటల నిల్వ చేసుకునేందుకు గోదాము ఏర్పాటు చేయాలని కోరారు.పంటపొలాలకు వెళ్లే వివిధ రకాల డొంకదారులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.శాఖ నూతన కార్యదర్శిగా దుగ్గి అన్నపూర్ణను ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి నాగారపు పాండు, నాయకులు పులిచింతల వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, ఆర్.మురళి,సాయిబాబా,చిన్నం వీరమల్లు, జక్కులవెంకటేశ్వర్లు, వీరబాబు, అనసూర్య, వెంకటమ్మ, సీతయ్య,కిషోర్, అంజలి, లక్ష్మమ్మ పాల్గొన్నారు.