Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్‌చేశారు. అనంతరం కార్యకర్తలు, ప్రజలకు స్వీట్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ ఉడుగు మల్లేశ్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ ఉడుగు శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి, ఎమ్‌డి.బాబా షరీఫ్, నాయకులు బొడిగె బాలకష్ణగౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, కానుగుల వెంకటయ్య, తడక కిరణ్, ఉష్కాగుల నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.
మోత్కూరు: మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని దత్తప్పగూడెం, పాలడుగు గ్రామాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మోత్కూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి, దత్తప్పగూడెంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ రచైర్మెన్్ కంచర్ల రామకష్ణారెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, కౌన్సిలర్లు బొడ్డుపల్లికల్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, దబ్బెటి విజయరమేష్, మలిపెద్ది రజిత, వనం స్వామి,కోఆప్షన్ మెంబర్లు గనగానినర్సింహ, పి.ఆనందమ్మ, షాహిన్ సుల్తాన, మార్కెట్ మాజీ చైర్మెన్ టి.మేఘారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అడ్డగూడూర్ : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ,జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్యల ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, మార్కెట్ మాజీ చైర్మెన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్ ,టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, మార్కెట్ డైరెక్టర్ పూలపెల్లి జనార్దన్ రెడ్డి , స్థానిక సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య, మండల ఉపాధ్యక్షులు బాలెంల విద్యాసాగర్,పట్టణశాఖ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి, తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్:తెలంగాణ రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో ఆ పార్టీ మండల అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కేక్‌ను ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతపింగల్రెడ్డి కట్‌చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, నాయకులు పంజాల సతీశ్‌గౌడ్, బక్కన దేవదాస్, సోము రమేశ్, మన్నె బాలరాజు, రవికుమార్, ఎమ్‌డి.అక్బర్ పాల్గొన్నారు.