Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరు టౌన్ : యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో రైల్వేగేట్ ఆవరణలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల పట్ల మాట్లాడిన మాటలు హేయనియమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు నందరాజు గౌడ్ తీవ్రంగా , కాంగ్రెస్స్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజశేఖర్ ,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్రే అజరు,మొలుగురి రాజు,ఏకు సుమన్ ,బుగ్గ మహేష్,బొద్దుల నగేష్,క్యాసాగాళ్ల చందు, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి:చదువుకున్న విద్యార్థులు ఒక మాదిరి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొనడాన్ని యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను ఆదివారం భువనగిరిలో దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ద్వారా నీళ్లు నియామకాలు నిధులు చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ నేతలు నేడు విద్యార్థుల పట్ల ప్రజల పట్ల భావజాలంతో మాట్లాడడం భావ్యం కాదన్నారు. నియామకాలు ఇవ్వకపోగా నోరు జారడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పూజిత ప్రధాన కార్యదర్శి వరుణ్ గౌడ్ నాయకులు కిరణ్, అవేజ్ చిస్తీ, కొండల్, పాశం వినోద్, శ్రీశైలం పాల్గొన్నారు.