Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
ప్రభుత్వం ఈ నెల 26 నుండి ప్రారంభించనున్న రేషన్ కార్డుల ప్రక్రియ గ్రామసభ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి రాజకీయ జోక్యం లేకుండా అర్హులకు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని బుర్కచర్ల గ్రామంలో శాఖా మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాలన్ని టీఆర్ఎస్ కార్యకర్తలకు అందుతున్నాయని విమర్శించారు.అర్హులకు సంక్షేమపథకాలు అందడం లేదని విమర్శించారు.57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ పింఛన్లు ఇవ్వకుండా లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.మండలంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్దిదారులను గుర్తించి అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సారెస్పీ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అంతకుముందు గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.పార్టీ గ్రామశాఖ మహా సభ ప్రారంభసూచకంగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు ఇరుగు కపానందం ఆవిష్కరించారు.పార్టీ మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో పార్టీ మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం, మండల నాయకులు ఎం.గోపాల రెడ్డి, కొండ రాములు, జెర్రిపోతుల లక్ష్మమ్మ, మైనంపాటి వెంకట్రెడ్డి, నాయకులు ములకలపల్లిఅశోక్, లింగమ్మ, గోపాల్, వీరస్వామి, అచ్చయ్య, జాన్వెస్లీ పాల్గొన్నారు.