Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వసతులు కరువూ...
- కనిపించని రైతు సమన్వయ సమితి సభ్యులు
రైతులకు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికపుడు తెలియజేసేందుకు అధికారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. నిత్యం రైతులతో చర్చించేందుకు స్థానికంగానే కార్యాలయం ఉండాలి. అందుకే ఏఈవో స్థాయిలో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మాణం చేసింది. అయితే ఇప్పటివరకు అవి సంపూర్ణంగా ఉపయోగంలోకి రాలేదు. వేదికలను ప్రారంభించారే కానీ అవి ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారో అది నేరవేరడంలేదు... అసలు రైతులకు సంబందంలేకుండానే కేంద్రాలు నిర్మాణం చేయడం వల్ల ఏ రైతు కూడ అటువైపు కన్నేత్తి చూడడంలేదు. అందుకే అవి నేడు నిరూపయోగంగా ఉన్నాయి.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడినల్లగొండ జిల్లాలో 342 ఏఈవో క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున క్లస్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారమే రైతు వేదికలు నిర్మాణం చేశారు. ప్రతి వేదికకూ ప్రభుత్వం నుంచి రూ.22లక్షల నిధులను కేటాయించారు.
అయితే జిల్లాలో 251 రైతు వేదికలు నిర్మాణం చేశారు. ఇంకా 91వేదికల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో 82 వేదికలకు గాను 81 పూర్తయ్యాయి. ఒకటి నిధులు లేక పెండింగ్‌లో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 92 క్లస్టర్ వేదికలకుగాను 30 నిర్మాణాలు పూర్తికాగా 62 కేంద్రాలకు సంబందించిన పనులు కొనసాగుతున్నాయి.
రైతు వేదికల ఉద్దేశం
ప్రతినెలా రైతులకు సాగులో ఉన్న మెళుకులు తెలియజేయడంతో పాటుగా ఇతర వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అందించడం, ఏయే పంటలు వేస్తే రైతులకు మద్దతు ధర వస్తుంది. లాభాలా బాటలో నడుచుకోవడం ఎలా అనే 4మిగతా 3లో...
రైతులు లేరూ..సమావేశాలూ లేవు..
విషయాలపై రైతులకు ఎప్పటికపుడు సమాచారం అందించడం కోసం సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ వేదికల నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇక్కడికి ఏ రైతును పిలిచింది లేదూ... సమావేశం ఏర్పాటు చేసింది లేదూ... రైతులకు సంబందంలేకుండానే ఈ నిర్మాణాలు జరిగినట్లు ఆయా గ్రామాల రైతులు పెర్కొంటున్నారు.
-కనీస వసతులు కరువు....
రైతు వేదిక కార్యాలయం అంటే క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారి కార్యాలయం.. ఇక్కడ కుర్చీలు, టేబుళ్లు, కనీసం తాగునీటి కోసం నీళ్ల క్యాన్ లేదా నీటి కుండ ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతులతో సమావేశం నిర్వహించే సమయంలో అధికారులు , రైతు సమన్వయ సమితి సభ్యులు , రైతులు కూర్చోవడానికి కనీసం చాపలు( పట్టాలు), కుర్చీలు కూడ లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. సమావేశ మందిరంలో వేసిన బండలను కూడ శుభ్రం చేసిన పరిస్థితి లేదు. ఇపుడిపుడే రైతులు కూర్చోవడానికి అవసరమైన కుర్చీల సరఫరా కోసం టెండర్లు స్వీకరిస్తున్నట్లు అధికారులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది.
సభ్యులకు సంబంధం లేకుండానే...
గ్రామ స్థాయిలో ఉన్న రైతు సమన్వయ సమితి సభ్యులకు సంబందంలేకుండానే ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు వేదికను ప్రారంభించి వెళ్లిపోతున్నారు. అక్కడికి ఏ సభ్యుడిని లేదా రైతులను పిలిచిన దాఖలాలు కనిపించడంలేదు. గ్రామాలలో అన్ని పార్టీలకు సంబందించిన రైతులతో సమన్వయ కమిటి వేసినట్లు చెపుతున్నప్పటికి వారేవరూ దీనితో సంబందం ఉందనే భావనలో లేకుండా ఉన్నారు.
- స్వాదీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి
-- శ్రీధర్‌రెడ్డి, జేడీఏ నల్లగొండ
రైతు వేదికలు నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే వాటిని ప్రారంబించుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఒకవేళ ప్రారంబించకపోయిన వాటిని స్వాదీనం చేసుకోవాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలున్నాయి. రైతులను పిలిచి సమావేశాలు కూడ పెడుతున్నాం. విషయాలపై రైతులకు ఎప్పటికపుడు సమాచారం అందించడం కోసం సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ వేదికల నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇక్కడికి ఏ రైతును పిలిచింది లేదూ... సమావేశం ఏర్పాటు చేసింది లేదూ... రైతులకు సంబందంలేకుండానే ఈ నిర్మాణాలు జరిగినట్లు ఆయా గ్రామాల రైతులు పెర్కొంటున్నారు.
-కనీస వసతులు కరువు....
రైతు వేదిక కార్యాలయం అంటే క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారి కార్యాలయం.. ఇక్కడ కుర్చీలు, టేబుళ్లు, కనీసం తాగునీటి కోసం నీళ్ల క్యాన్ లేదా నీటి కుండ ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతులతో సమావేశం నిర్వహించే సమయంలో అధికారులు , రైతు సమన్వయ సమితి సభ్యులు , రైతులు కూర్చోవడానికి కనీసం చాపలు( పట్టాలు), కుర్చీలు కూడ లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. సమావేశ మందిరంలో వేసిన బండలను కూడా శుభ్రం చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే రైతులు కూర్చోవడానికి అవసరమైన కుర్చీల సరఫరా కోసం టెండర్లు స్వీకరిస్తున్నట్టు అధికారులు స్వీకరిస్తున్నట్టు తెలిసింది.
సభ్యులకు సంబంధం లేకుండానే
గ్రామ స్థాయిలో ఉన్న రైతు సమన్వయ సమితి సభ్యులకు సంబంధంలేకుండానే ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు వేదికను ప్రారంభించి వెళ్లిపోతున్నారు. అక్కడికి ఏ సభ్యుడిని లేదా రైతులను పిలిచిన దాఖలాలు కనిపించడంలేదు. గ్రామాలలో అన్ని పార్టీలకు సంబంధించిన రైతులతో సమన్వయ కమిటి వేసినట్టు చెపుతున్నప్పటికి వారేవరూ దీనితో సంబంధం ఉందనే భావనలో లేకుండా ఉన్నారు.
స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి
శ్రీధర్‌రెడ్డి, జేడీఏ నల్లగొండ
రైతు వేదికలు నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే వాటిని ప్రారంభించుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఒకవేళ ప్రారంభించకపోయిన వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలున్నాయి. రైతులను పిలిచి సమావేశాలు కూడా పెడుతున్నాం.