Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ జీవద్భాషను, అస్థిత్వాన్ని శీలం భద్రయ్య తన కథా సంకలనం 'లొట్ట పీసు' పూలులో ఆవిష్కరించారని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నల్లగొండ కు చెందిన కథా రచయిత శీలం భద్రయ్య రచించిన లొట్ట పీసు పూలు కథా సంకలనాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ తండు కష్ణ కౌండిన్య అధ్యక్షతన ఆదివారం ఎన్జీ కళాశాల ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా జనజీవన సంస్కతిని ఈ కథలు ప్రతిబింబించాయని కొనియా డారు. ప్రముఖ విమర్శకులు వెల్దండి శ్రీధర్ మాట్లాడుతూ లొట్ట పీసు పూలు కథలు సామాజిక స్పహతో, సందేశాత్మకంగా ఉన్నాయి అన్నారు. ప్రముఖ నవలా రచయిత వేముల ఎల్లయ్య మాట్లాడుతూ బడుగు బలహీన జీవితాల ప్రతీకలుగా శీలం భద్రయ్య కథలు నిలుస్తాయి అన్నారు. ప్రముఖ సాహితీవేత్త పరిశోధకులు ఎలికట్టె శంకర్ రావు మాట్లాడుతూ సహజత్వానికి దగ్గరగా చైతన్యం కలిగించే కథలు భద్రయ్య రచించారన్నారు. ఆదర్శ పాఠశాలల సంయుక్త సంచాలకులు పాలడుగు సరోజినీ దేవి మాట్లాడుతూ ఉపాధ్యాయుడుగా, రచయితగా శీలం భద్రయ్య నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. డాక్టర్ వి జయ ప్రకాష్ మాట్లాడుతూ భద్రయ్య తూ ప్రధానంగానే కాక కథను సరికొత్త మలుపులతో తీర్చిదిద్దే నైపుణ్యం కలవాడు అన్నారు. శ్రీ బుద్ధ భగవాన్ సాయి శివ శంకర గణేశ వరప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రస్టు అధ్యక్షులు మాదగాని శంకరయ్య స్వాగత వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ బెల్లి యాదయ్య, బైరెడ్డి కష్ణారెడ్డి, డాక్టర్ పగడాల నాగేందర్, స్కై బాబా, డాక్టర్ మండల స్వామి, ధనుంజరు, యాసరపు రాంబాబు , డాక్టర్ లేఖానంద స్వామి, సాగర్ల సత్తయ్య, జానకిరామ్, లింగంపల్లి హేమలత, భాను శ్రీ కొత్వాల్, మహమ్మద్ హసేనా, పగిడిపాటి తదితరులు పాల్గొన్నారు.