Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్రంలో ఎస్సీ ,ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా కన్వీనర్ చాముండేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టంలోని నిబంధనలకనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు మిగతా వర్గాలకు ఉన్న అంతరాలను గుర్తించేందుకు అధ్యయనం చేయాల్సి ఉండగా ఎటువంటి అధ్యయనం చేయకుండానే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో కార్యదర్శి శివలింగం ,జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరం కన్వీనర్ చింతమల్ల గురువయ్య , గద్దపాటి సురేందర్ ,మధు ,రాజేందర్, జీడిమెట్ల రవీందర్ ,తదితరులు పాల్గొన్నారు.