Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన ఆశయ సాధన కోసం కషి చేద్దాం
- జాతీయ కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ - భువనగిరి
వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమంలో చెరిగోపోని పాత్ర జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ది అని, ఆయన ఆశయ సాధనకు పూనుకుందామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్లో వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన వేముల మహేందర్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. వేముల మహేందర్ వ్యవసాయ కార్మిక సంఘం రామన్నపేట, భువనగిరి డివిజన్ కార్యదర్శిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకునిగా పనిచేశారని తెలిపారు. యాదాద్రి భువనగిరి నూతన జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ అనేక భూమి, కూలీ పోరాటాలు నడిపారని అన్నారు. నిరంతరం వ్యవసాయ కార్మిక ఉద్యమాలు నిర్వహించేవారని జిల్లాలో అనేక మండలాల్లో ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులకోసం, పింఛన్ల కోసం మరుగుదొడ్లు, బాత్ రూమ్ల బిల్లుల కోసం నిరంతరం పోరాడేవారని గుర్తు చేశారు. అనేక గ్రామాల్లో పేదల ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూముల పట్టాల కోసం పోరాడి వాటిని సాధించాడని గుర్తుచేశారు. వేముల మహేందర్ పోరాటాల వల్ల పేదలు, కూలీలు నేడు ఇండ్లు, ఇండ్ల స్థలాలు పొందారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు చెందిన ప్రభుత్వ, బంజరు, పోరంబోకు భూములను అన్యాయంగా లాక్కొనిసంక్షేమ కార్యక్రమాల పేరుతో వారిని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం వేముల మహేందర్ నిరంతరం పోరాడే అని గుర్తుచేశారు నేడు ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై పోరాడుదాం అని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమం రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకున్ని కోల్పోయిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కషి చేయాలని పిలుపునిచ్చారు . రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. జహంగీర్ మాట్లాడుతూ వ్యకాస జిల్లా అధ్యక్షులుగా ఉన్న వేముల మహేందర్ ను కోల్పోవడం జిల్లా ఉద్యమానికి తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ఉద్యమాల్ని విస్తతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ వేముల మహేందర్ జీవిత చరిత్ర, వారి యొక్క పోరాట స్ఫూర్తిని సంతాప తీర్మానం ద్వారా తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి సిరిపంగి స్వామి, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, రాచకొండ రాములమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, సహాయ కార్యదర్శులు సల్లూరి కుమార్, గంగాదేవి సైదులు, కలుకూరి రామచంద్రం, కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, బొజ్జ బాలయ్య,బోయ యాదయ్య, మామిడి స్వరూప,సావంత్ లక్ష్మి, బొడ్డు కిషన్, మెతుకు అంజయ్య, దొడ్డి బిక్షపతి, కొండ కిష్టయ్య, రాపోలు నర్సిరెడ్డి, పోతుగంటి బిక్షపతి, వల్దాస్ అంజయ్య,టంటం వెంకటేష్, వేముల మహేందర్ సతీమణి సతీమణి లలీత , కుమారుడు జ్యోతి బాబు పాల్గొన్నారు.