Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్
నవతెలంగాణ -భువనగిరి రూరల్
పట్టణ ప్రాంతాలను అన్ని హంగులతోనూ అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ కోరారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఆ శాఖ డైరెక్టర్ సత్యనారాయణతో కలిసి కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ లతో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యం సాధించడంతోపాటు , మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక కౌన్సిలర్లు, అధికారులు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాలలోని లేఅవుట్ ఆడిట్ చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు పది శాతం భూమి కంటే తక్కువ కేటాయించినచో రికవరీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. 2014 తర్వాత అధికారికమైన లే అవుట్స్ అనుమతి పొంది ఉండి 10 శాతం ఫైన్ కింద వసూలు చేయాలని సూచించారు. మున్సిపాలిటీలలో ల్యాండ్ ఫూలింగ్ విధానంలో భాగంగా ప్రభుత్వ భూమి లేదా, ప్రైవేట్ భూములను 25 ఎకరాల మేరకు గుర్తించి మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాలని, ఆ భూమిలో అధికారికంగా లేఅవుట్ రూపొందించి సిద్ధం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, స్థానిక సంస్థల నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.