Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ ఏవి.రంగనాథ్
- ఈద్గా వద్ద ఏర్పాట్లు పరిశీలన
నవతెలంగాణ -నల్లగొండ
బక్రీద్ పండుగ వేడుకలు, ఈద్గాల వద్ద నిర్వహించే ప్రార్థనలు కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని డీఐజీ ఏవి. రంగనాథ్ చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ సందర్భంగా చేసిన ఏర్పాట్లను ఏవి.రంగనాథ్, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. ఈద్గా వద్ద చేస్తున్న ఏర్పాట్లపై డీఐజీ సంతప్తి వ్యక్తం చేసి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పర్వదిన సందర్బంగా అన్ని ఈద్గాల వద్ద అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో విధిగా మాస్కులు ధరించడం, ఈద్గాల పరిసరాల్లో శానిటైజ్ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లగొండ జిల్లా హిందు, ముస్లిం పండుగలను ఐకమత్యంగా నిర్వహించుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణంలో జిల్లాలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట హఫీజ్ ఖాన్, డాక్టర్ ఏ.కె.ఖాన్, మౌలానా ఇసాముద్దీన్, జియావుద్దీన్, షబ్బీర్, ఖాజీముల్లా, బషీరుద్దీన్, మూర్తుజా, వహిద్, మోయిన్, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, నల్లగొండ వన్ టౌన్ సీిఐ బాలగోపాల్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు ఉన్నారు.