Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూర్:
గ్రామాలు అభివద్ధి చెందితేనే రాష్ట్రం అభివద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్, పెద్దపీట వేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మండలంలోని 10 గ్రామ పంచాయతీల అభివద్ధిపై మంగళవారం స్థానిక మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు, ఇతర అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివద్ధికి ఇటీవల విడుదల చేసిన రూ. 25 లక్షల ప్రత్యేక నిధులను ఆయా గ్రామాల్లో అభివద్ధి పనులు, ఇతర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం కొండగడప గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బుడిగ జంగాల కాలనీలో తాగునీరు, విద్యుత్తుతో పాటు వివిధ సమస్యలను ప్రజలు ఆయన దష్టికి తీసుకురాగా తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల విక్రాంత్ తండ్రి యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి, జెడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మీ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాంపాక నాగయ్య, సర్పంచులు దండెబోయిన మల్లేష్, వర్రె కవితశ్రీను, అండెం రజితరాజిరెడ్డి, ఉప్పల లక్ష్మి, ఎలుగు శోభ, తిరుమలేష్, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, తహసిల్దార్ షేక్ అహ్మద్, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, మార్కెట్ మాజీ వైస్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.