Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరొకరికి గాయాలు
అర్వపల్లి: ప్రమాదవశాత్తు బైక్ ఆదుపు తప్పి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పర్సాయిపల్లి గ్రామానికి చెందిన పంది సైదులు (26), పంది విజరులు కలిసి సూర్యాపేటలో పెయింటిగ్ పనులు చేసేందుకు బైక్పై వెళ్తున్నారు. వారు రామన్నగూడెం గ్రామం వద్దకు రాగనే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్ను ఢ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పంది సైదులు మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహేష్ తెలిపారు.