Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవింద్
సూర్యాపేట: తాటిచెట్టుపై నుంచి కింద పడి గాయపడ్డ మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన పెద్ది శ్రీనుగౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవింద్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది శ్రీనును ఆయన పరామర్శించి మాట్లాడారు. శ్రీను కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం పట్టణాధ్యక్షులు గునగంటి కృష్ణ, ఉయ్యాల నర్సయ్యగౌడ్, పెద్ది సందీప్ ఉన్నారు