Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల సంరక్షణ కమిటీ చైర్మెన్ రమణారావు
నవతెలంగాణ - కోదాడరూరల్
బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని బాలల సంరక్షణ కమిటీ చైర్మెన్ బి.రమణారావు హెచ్చరించారు. కోదాడ డివిజన్ వ్యాప్తంగా వివిధ దుకాణాల్లో పని చేస్తున్న 13 మంది బాల కార్మికులను బాలల సంరక్షణ కమిటీ సభ్యులు చేరదీశారు. మంగళవారం పట్టణంలోని సీడీపీవో కార్యాలయంలో బాలల సంక్షేమ సమితి కోర్టు ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడీడు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అనాథ పిల్లలకు ఆర్థిక సాయం అందించి విద్యా వసతి కూడా కల్పిస్తామన్నారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోయిన కుటుంబాలకు ఉచితంగా విద్య అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ సమావేశంలో బాలల సంరక్షణ కమిటీ చైర్మెన్ బి.రమణారావు, సీడీపీవో వెంకటరమణ, సహాయ సీడీపీవో నాగమణి, కమిటీ సభ్యులు బిక్షం, రామిరెడ్డి, సహాయ లేబర్ ఆఫీసర్ వాల్యానాయక్, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.రవికుమార్, నాగుల్ మీరా, విద్యాసాగర్, సాయి, కరుణాకర్, సఫియా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు