Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోటకొండూర్ : త్యాగనికి భక్తి భావానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని బుధవారం మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద కోవీడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జాంగిర్, ఎండి అఫ్జల్, బురాన్, యాకూబ్ బాబా, అంకుష్, జమాల్, లతీఫ్, షానూర్ బాబా, అష్రఫ్, సలీం, ఖలీల్, యాకూబ్ పాషా, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
మోత్కూర్: త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగను బుధవారం మోత్కూర్ మండలంలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మసీదుల్లో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెల్పుకున్నారు. హజరత్ ఇబ్రహీం ఇస్లాంను స్మరించుకుంటూ జరుపుకునేది బక్రీద్ పండుగని, మంచి వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని బక్రీద్ పర్వదినం సందర్భంగా బుధవారం ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అలరు బలరు తీసుకున్నారు.
చౌటుప్పల్:చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో బుధవారం ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలరు బలరు తీసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు ముస్లిమ్ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎమ్‌డి.బాబా షరీఫ్, కోరగోని లింగస్వామి, నాయకులు తాడూరి పరమేశ్, ఎమ్‌డి.అత్తార్పాషా, బత్తుల స్వామి, అంతటి బాలరాజు, చోటేబాయి, ఖలీల్, జమీల్ పాల్గొన్నారు.
భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి బక్రీద్ పండుగను బుదవారం ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పలువురు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహులు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
పట్టణంలోని ఈద్గాలో బక్రీద్ సందర్బంగా ప్రార్ధనలలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, తంగెల్లపల్లి రవికుమార్,పచ్చల జగన్, కైరంకోండ వెంకటేష్, దుర్గా భవాని,అంగడి నాగరాజు,యండి బబ్లు, సలావుద్దిన్, తాహెర్,రషీద్,కూర వెంకటేష్,దర్గారు హరిప్రసాద్,తాడురు నర్సిమ్హ,డాకురి నిరంజన్,బెండె శ్రీకాంత్, దండు నరేష్,కోల్లురు రాజు,మనోజ్, ఉపేందర్ పాల్గోన్నారు.
చైర్మెన్, వైస్ చైర్మెన్ ఆధ్వర్యంలో
మున్సిపల్ చైర్మన్ ఎన బోయిన ఆంజనేయులు వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య లు బుధవారం ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభకాంక్షలు తెలిపారు.
ఆలేరుటౌన్ : మండల కేంద్రంలో బుధవారం బక్రీద్ పండగ పర్వదినం పురస్కరించుకుని భక్తి శ్రద్ధల నడుమ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు నిర్వహించారు. ఆలేరు శాసన సభ్యురాలు రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు , మాజీ శాసనసభ్యులు డాక్టర్ కె నాగేశ్, బూడిద భిక్షమయ్య గౌడ్,బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి ,బీర్ల ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య,నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. .పండగ శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ గదపాక నాగరాజు ,
ఆలేరు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ,పీఏ సీఎస్ చైర్మెన్ మొగలగాని మల్లేశం,వైస్ చైర్మెన్ చింతకింది చంద్రకళ మురహరి, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ గౌస్ షరీఫ్ పాషా,ఎంఏ ఎజాజ్, ఎండీసలీం, ఎండీజైనోద్దీన్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాదర్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎండీ రియాజ్ ఉన్నారు .