Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుర్కపల్లి :గ్రామాభివృద్ధి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని సీపీఐ మండల కార్యదర్శి సిల్వేరు దుర్గయ్య అన్నారు. దమండలంలోని ముల్కపల్లి గ్రామంలో బుధవారం ఆ పార్టీ గ్రామ శాఖ సమావేశం వల్లపు భగవంతు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంరగా ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు,పల్లెప్రగతి లాంటి అభివద్ధి కార్యక్రమాల్లో గ్రామ సర్పంచి,ఉపసర్పంచ్,సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు, గ్రామా అభివద్ధి కిసంబంధించిన నిధులను లోపల కుమ్మక్కై డ్రా చేశి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈదులకంటి రమేష్,ధరావత్ నిమ్మ నాయక్,దాసరి బాలయ్య, సిలివేరు స్వరూప,పరశురాం, కోట యాదయ్య,సిలివేరు నాగరాజు,రాజు,బబ్బూరి బాను,సందేపల్లి పోషయ్య,కాశయ్య,నక్కిర కంటి అనిత,కోట భాస్కర్,కొండల్ పాల్గొన్నారు.