Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-కేతెపల్లి
ఈ నెల 12 తేదీన మండలంలోని కొప్పోలు గ్రామంలో అర్ధరాత్రి హత్యకు గురైన ప్రీతి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. హత్యకు గురైన దళిత బాలిక ప్రీతి కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని హత్య చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలను ఇప్పించేందుకు తాను కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బోల్ల నరసింహా రెడ్డి , టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నలపరాజు రాజు వెంకన్న పాల్గొన్నారు.