Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్
దేవులపల్లి ఓంప్రకాష్ మృతి ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు.బుధవారం స్థానిక టీఎస్యూటీఎఫ్్ ప్రాంతీయ కార్యాలయంలో ఓం ప్రకాష్ సంతాపసభ ఆ సంఘం జిల్లా కార్యదర్శి. యాట మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓం ప్రకాష్ ఉమ్మడి నల్లగొండ జిల్లా యుటిఎఫ్ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేశారన్నారు. నకిరేకల్ ప్రాంతంలో సంగం అభివద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. సంఘం ఆశయాల కోసం నిరంతరం పని చేశారని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విస్తతంగా పర్యటించి అనేక మంది ఉపాధ్యాయులను సభ్యులుగా చేర్పించి సంఘం బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందినప్పటికీ సంగం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ యువ కార్యకర్తలకు స్ఫూర్తి ఇచ్చారని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి పాఠశాలను భౌతికంగా నడిపించాలన్నారు. పాఠశాలలో గతంలో పనిచేసిన స్కావెంజర్స్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. నేటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు లేదని, వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు యాకయ్య, జిల్లా కోశాధికారి శేఖర్ రెడ్డి, ఎన్. వెంకన్న, నకిరేకల్ డివిజన్ బాధ్యులు గంగాధర భద్రయ్య, రాగి రాకేష్, జయ సాగర్, రఘు, మధు, సీనియర్ కార్యకర్తలు యానాల కృష్ణారెడ్డి, వీర్ల పాటి శ్రీనివాసులు, పండుగ తిరుమలయ్య, బి. ప్రకాశరావు పాల్గొన్నారు.