Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కషి చేస్తుందని ఎమ్మెల్యే నోములభగత్ అన్నారు.బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఆయన మసీదును సందర్శించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు ఎమ్మెల్య్నోఉ సన్మానించారు. ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఆయన వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ నల్లగొండ సుధాకర్, వార్డు కౌన్సిలర్లు వర్రా వెంకట్‌రెడ్డి, కోఆప్షన్ మెంబర్ అన్వరుద్దీన్, మైనార్టీ నాయకులు బాబుద్దీన్ ఉన్నారు.
కొండమల్లేపల్లి : పట్టణంలో ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ వేడుకలు నిర్వహించారు.ఎస్సై భాస్కర్‌రెడ్డి బక్రీద్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ముస్లిం సోదరులు మసీదులలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపు తున్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు మౌలానా, నజీర్, ఎస్కె.జహంగీర్, అల్లాభక్ష్,కబీర్, సలాం పాల్గొన్నారు.
తుంగతుర్తి:భక్తికి ,త్యాగానికి, సహనానికి బక్రీద్ పండుగ ప్రతీక అని ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్ పేర్కొన్నారు.బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా వారు ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ పండుగను జరుపుకోవాలని సూచించారు.దైవప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిములు బక్రీద్ పండుగను జరుపుకుంటారని చెప్పారు.
నేరేడుచర్ల : మండలంలోని రోళ్లవారిగూడెంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈద్గాలో ప్రత్యేకపూజలు నిర్వహి ంచారు.ముస్లింసోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివద్ధి పనులను పరిశీలించి హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకుంట్లసోమిరెడ్డి, జెడ్పిటిసీ రాపోలు నర్సయ్య,వైస్‌ఎంపీపీ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : పట్టణంలో ముస్లిములు బుధవారం భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా మతపెద్ద ముక్తి మహమ్మద్ మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక ఈ పండుగ శుభకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎండి అజీజ్ భాషా, బాజీ,ఎస్కె.మోయిన్, బిక్కన్ సాహెబ్, ఎస్కె.సైదా, సలీం, హజ్జు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ :మండలంలోని అనంతారం గ్రామంలోని మసీద్‌లో జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య ముస్లిం సోదరులకు బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు షేక్‌హుస్సేన్, షేక్ షరీఫ్, చాంద్‌పాషా, షేక్‌షఫీ, రఫీ, షేక్ సయ్యద్, దాదేసాయబ్, యాకుబ్, షేక్‌ఖాదర్ పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండలకేంద్రంలో బక్రీద్ పర్వదినం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్, నాయకులు పేరాల వీరేష్, మైనార్టీ సెల్చైర్మెన్ మహ్మద్ అఫీన్, యువజన కాంగ్రెస్ నాయకులు రాకేష్ పాల్గొన్నారు.
చివ్వెంల : మండలంలోని వివిధ గ్రామాలలోని మసీదులలో కరోనా నిబంధనలు పాటిస్తూ మసీదుల్లో ముస్లిములు ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ముస్లిములు పాల్గొన్నారు.