Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
కరోనా ఆపత్కాలంలో ప్రతి కుటుంబానికి కేరళ తరహాలో రూ.7500 ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు బుధవారం మండలంలోని కొంపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ వివక్ష చూపుతూ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ జిల్లాలను అభివద్ధి చేసే రాష్ట్రమంతా అభివద్ధి చెందిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు నల్గొండ జిల్లా పై కెసిఆర్ సమితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించాల్సిన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని ఆయన మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే , ఎంపీలు చనిపోయి ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆ ప్రాంత అభివద్ధికి నోచుకోవడం లేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వడ్లమూడి హనుమయ్య , శాఖమూరి నారాయణ రావు , శరబంది , సుబ్బయ్య , తదితరులు ఉన్నారు