Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు బత్తుల ఊషయ్య
నవతెలంగాణ -నార్కట్పల్లి
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా అప్రజాస్వామికంగా , వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఏఐసీసీ ఆధినాయకురాలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ తో పాటు పార్టీ ముఖ్యనాయకుల, ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేయడం హేయమైన చర్యని కాంగ్రెస్ మండల అధ్యక్షులు. బత్తులఉషయ్య మండిపడ్డారు. ఇజ్రాయిల్ కు చెందిన పెగాసెస్ అనే సాఫ్ట్ వేర్ తో ట్యాంపరింగ్ చేయడానికి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం చేపట్టిన హైదరాబాద్ లోని,(ఇందిరా పార్కు ) నుండి రాజ్ భవన్ కు చలో రాజ్ భవన్ వెళ్లకుండా స్థానిక పోలీసులు తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కి వేయాలని చూస్తుందన్నారు. అరెస్టయినవారిలో ఆ్ పార్టీ మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య .మాజీ ఎంపీటీసీ. ఐత రాజు యాదయ్య,జారిపోతుల, భరత్ గౌడ్,ఎండి సమద్, తదితరులు ఉన్నారు.
చిట్యాల: కేంద్ర ప్రభుత్వం ఏఐసీసీ అధినాయకులు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి నిరసనగా చలో రాజ్ భవన్కు ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆ పార్టీ మండల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ, గోధుమగడ్డ జలందర్ రెడ్డి,12వ వార్డు కౌన్సిలర్ రేముడల లింగాస్వామి, కందటి రమేష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్,వల్లమల్ల యాదగిరి,రేముడల మధు ,గంగారావు ,గణేష్,మాల్యల నరేందర్,జిట్ట శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.