Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ :కేంద్ర ప్రభుత్వం ఏఐసీసీ ఆధినాయకురాలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీతో పాటు పార్టీ ముఖ్యనాయకుల, ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజభవన్ ముట్టడి కార్యక్రమాన్ని వెళ్తున కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు అది మల్ల శంకర్, నాయకులు గాదె యాదగిరి , కిన్నెర నగేష్‌లను గురువారం వన్‌టౌన్ పోలీసులు నాయకులను రాజ్‌భవన్‌కు వెళ్లకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు . ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆదిమల్ల శంకర్ మాట్లాడుతూ సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను అధికార పార్టీ అడ్డుకొని అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు.అక్రమ .అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సూచించారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు
చిలుకూరు : మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముం దస్తుగా అరెస్టు చేశారు.వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో చిలుకూరు, దూదియాతండా సర్పంచులు నందలాల్, కొల్లు నాగయ్య,నాయకులు నర్సింహారావు ఉన్నారు.