Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగి పొర్లుతున్న వాగులు వంకలు
- అనంతగిరిలో విరిగిపడిన చెట్లు
- నాగారం, చివ్వెంలలో నీటిమునిగిన పంటపొలాలు
నవతెలంగాణ-అనంతగిరి
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి మండల పరిధిలోని పాలవరం గ్రామము అనంతగిరి గ్రామాన్ని కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఈదురు గాలులకు చెట్లు విరిగి పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.చెట్టును తొలగించేందుకు స్థానికులు స్పందించి తక్షణచర్యలు చేపట్టడంతో వాహనాల రాకపోకలు సాగాయి.అదే గ్రామంలో రెండు చెరువుల మధ్య ఉన్న ప్రధాన రహదారి జలమయంగా మారింది. ఈ భారీ వర్షానికి రెండు చెరువులు నిండుకుండలా ఉప్పొంగి రోడ్లను జలమయం చేశాయి.వాహనాల రాకపోకలు నిలిచాయి.మండలంలోని వాయిలసింగారం గ్రామానికి3 ఎందిన గూడపూరి పుల్లమ్మ ఇండ్లు కూలి పోయింది.దీంతో ఆమె తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతుంది.
నూతనకల్: రెండు రోజులుగా నిరంతరం కురుస్తున్న వర్షానికి పాలేరు వాగుపై నిర్మించిన గుండ్ల సింగారం ప్రాజెక్టు పొంగిపొర్లి నీరు ప్రవాహంగా మారడంతో నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరుఎస్ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పొర్లుతున్న నీరు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రానున్న రోజుల్లో ప్రాజెక్టుని ఆధునీకరించి పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
నాగారం : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని గ్రామాల్లో చెరువులు కుంటలు నిండుకుండలా తలపిస్తున్నాయి.బిక్కేరు వాగు వారం రోజుల నుండి మోస్తారుగా ప్రవహిస్తూనే ఉంది.మండలంలో 45.8 శాతం వర్షం నమోదైంది.కొన్ని గ్రామాల్లో వరి పొలాలు, పత్తి చేనులు నీటమునిగాయి.వరి పంటను పెద్ద ఎత్తున సాగు చేయడం కోసం రైతులు పొలాలను సంసిద్ధం చేస్తున్నారు.
అదేవిధంగా మండలంలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వర్ధమానుకోట గ్రామానికి చెందిన బుర్ర నరేష్ ఇంటిపై కప్పు, గోడలు కూలాయి.గోడలు కూలుతున్న సమయంలో ఇంట్లో ఉన్న వారు బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.ఇంట్లో ఉన్న బియ్యం, ధాన్యం గింజలు, నిత్యావసర సరుకులు పూర్తిగా తడిచాయి.అధికారులు కూలిపోయిన ఇంటిని పరిశీలించి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుండి ఆర్థికసహాయం అందించాలని అధికారులను కోరారు.
నీటమునిగిన పొలాలు
చివ్వెంల: మండలపరిధిలోని తిరుమలగిరి గ్రామంలో రైతు పబ్బు నాగయ్య తన వ్యవసాయ భూమిని మట్టి పోయించి ఎత్తుగా చదును చేయించడం వల్ల ఆ పొలాల మధ్య నుంచి దారి ఉండడంతో దారి ద్వారా వచ్చే వరద నీళ్లు కింద ఉన్న చెరువులోకి వెళ్లడం లేదు. 60 ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.