Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో పోలీసులను సర్వీసు నుంచి తొలగింపు చర్య సమంజసమే
నవతెలంగాణ-భువనగిరి
అడ్డగూడూరు మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌లో లాకప్ డెత్ గురైన దళిత మహిళా మరియమ్మ విషయంలో పోలీస్ శాఖ సంబంధిత బాద్యులను సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించడం సమంజసమైన చర్యనేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. గురువారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాకప్‌డెత్‌లు రాష్ట్రంలో 30ఏండ్ల క్రితం జరిగేవని తెలిపారు. చాలాకాలం తర్వాత జిల్లాలో లాకప్‌డెత్ జరగడం దుర్మార్గమైన విషయమన్నారు.లాకప్ డెత్ పై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకొని దానికి కారణమైన బాధ్యుల్ని సర్వీసు నుంచి పూర్తిగా తొలగించడం వల్ల పోలీస్ శాఖ పై ప్రజలకు కొద్ది మేరకైనా నమ్మకం కలుగుతుందన్నారు. వాస్తవంగా జిల్లా పరిధిలోని అనేక పోలీసు స్టేషన్లల్లో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు కేసులపట్ల వారికి అనుకూలంగా వ్యవహరించడంతో పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చిపెడుతుందన్నారు. వాస్తవాలు తెలిసేందుకు జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్నేహపూర్వక సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో జరుగుతున్న అనేక అంశాలపై దష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహా, మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,దాసరి పాండు, మాయ కష్ణ దయ్యాల నరసింహ, సిర్పంగి స్వామి,అనగంటి వెంకటేష్ పాల్గొన్నారు.