Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దివంగత కల్నల్ సంతోష్‌బాబుకు ఘననివాళులు
- వీరమరణం పొందిన సైనికుల పట్ల తెలంగాణప్రభుత్వం తోడ్పాటు మరువలేనిది
- ఎయిర్‌మార్షల్ టీఎస్ఎస్ కిష్ణన్
నవతెలంగాణ-సూర్యాపేట
దేశరక్షణలో యువత సైన్యంలో చేరి కీలకపాత్ర పోషించాలని, దేశరక్షణలో సైనికుల పాత్ర కీలకమని ఎయిర్‌మార్షల్ టీఎస్ఎస్ కిష్ణన్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తాలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహం వద్ద ఎస్పీ భాస్కరన్‌తో కలసి ఆయన ఘనంగా నివాళులర్పించారు.ఒక నిమిషం మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు దేశరక్షణలో చేసిన సేవలను ఆయన కొనియాడారు.దేశంలోని యువత కల్నల్ సంతోష్‌బాబు స్ఫూర్తితో సైన్యంలో చేరుటకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి అందించిన తోడ్పాటు విషయంలో సైనికులు ఎన్నటికీ మరువలేరని స్పష్టం చేశారు.తెలంగాణలోని 31 బెటాలియన్ అధ్వర్యంలో దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహం శుభ్రపరిచి ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా దేశరక్షణలో బాగంగా దేశ సరిహద్దులలో అమరులైన సైనికుల విగ్రహాలకు ఆయా రాష్ట్రాలలో ఎన్సీసీ బెటాలియన్ ద్వారా విగ్రహాలను పరిశుభ్రం అనంతరం వారు అందించిన దేశ సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పిస్తామన్నారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల మాట్లాడుతూ తన కొడుకు సైనికునిగా దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం మోడల్‌స్కూల్,ఇమామ్ పీట,ఎస్వీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడారు.ఈ కార్యక్రమంలో కల్నల్ సురేందర్ శేరి, కల్నల్ డఖ, డీిఎస్పీ మోహన్‌కుమార్, సైనికుల సంక్షేమం మాజీ కల్నల్ శ్రీనివాసరావు,ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.