Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా ఉద్యమానికి సిద్ధం కావాలని రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య పిలుపునిచ్చారు. ఆయా సంఘాల నల్లగొండ జిల్లా విస్తత సంయుక్త సమావేశం గురువారం స్థానిక దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగసంస్థలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏడు నెలలకు పైగా ఢిల్లీలో ఆందోళనలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సంస్కరణల బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి కూలీల డబ్బులను కులాల వారిగా నిర్ణయించడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించి, 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను తప్పుదోవ పట్టించడానికి మతోన్మాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు సేవ్ ఇండియా నినాదంతో ఈ నెల 30న మూడు సంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 25 వతేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై చైతన్యం కల్పించాడాని కి అన్ని మండల, గ్రామ ,పట్టణ కేంద్రాలలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఆగస్టు 2,3,4 తేదీలలో గ్రామ పట్టణ మండల ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలని, ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు రైతు, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, చిన్న పాక లక్ష్మీనారాయణ, బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మూడు సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు బండ శ్రీశైలం, కూన్ రెడ్డి నాగిరెడ్డి, డబ్బీకార్ మల్లేష్, దండం పల్లి సత్తయ్య, కత్తుల లింగస్వామి గొర్ల ఇంద్రారెడ్డి కుంభం కష్ణారెడ్డి, మల్లు గౌతంరెడ్డి ,రవి నాయక్, పార్వతి అద్దంకి నరసింహ, శ్రీనివాస్ అయితరాజు నరసింహ సైదులు రెడ్డి అశోక్ రెడ్డి మంగారెడ్డి భీమ గాని గణేష్ వంటే పాక వెంకటేశ్వర్లు ,ఆది మల్ల సుధీర్ పోలే సత్యనారాయణ పాల్గొన్నారు.