Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తు ముమ్మరం
నల్లగొండ: కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రీతి అనుమానాస్పద మతి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఏఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు రీపోస్ట్ మార్టమ్ నిర్వహించారు. కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ప్రీతి ఈనెల 13న మతి చెందింది. అటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేతేపల్లి ఎస్ఐ రామకష్ణను వీఆర్‌కు అటాచ్ చేశారు. ఏఎస్పీ సతీష్‌ను విచారణాధికారిగా నియమించారు.. సమగ్ర విచారణతో పాటు.. వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఐజీ ఏవి.రంగనాథ్ ఆదేశించారు. విచారణలో పారదర్శకత కోసమే ఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. నల్లగొండ పట్టణంలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఒకేషనల్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడుతు న్నాడు. పదే పదే ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. ప్రేమను ఒప్పుకో కపోవడంతో చివరకు బాలికను కిడ్నాప్ చేశాడు. అయితే సోమవారం రాత్రినుండే ప్రీతి కనిపించ కుండాపోయింది. దీంతో యువతి తల్లిదండ్రులు.. చుట్టుప్రక్కల గాలించారు. ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి మడికట్లలో ప్రీతి విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు.. తమ కూతురు చావుకు పవనే కారణమని యువతి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.ప్రేమ పేరుతో తన కూతురిని వేధించి.. చివరికి పవన్ హత్య చేశాడని చెబుతున్నారు.