Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
పట్టణంలోని కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.రూరల్ ఎస్సై లవకుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అరెస్టయిన వారిలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు గట్టు శ్రీనివాస్,టేకుమట్ల ఎంపీటీసీ చింత అలివేలు కేశాలు, ఉపసర్పంచులు పాముల సైదులు, సుంకరి లక్ష్మీనారాయణ,నాయకులు మిద్దె రమేశ్,రమేశ్‌యాదవ్, పోకల వరుణ్ ఉన్నారు.
తుంగతుర్తి :పట్టణంలోని కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్,పెద్దబోయిన అజరు కుమార్,ఎల్లబోయిన శ్రీకాంత్, ఉప్పులరాంబాబు, మాచర్ల అనిల్, హరికష్ణ ఉన్నారు.
చివ్వెంల : మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్ననాయక్, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పఠాన్, సమీర్, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు ధరావత్ లాలునాయక్, అనిల్, భూక్యా శంకర్ వీరన్న, చందూలాల్, తులసీరాం, కుమార్ ఉన్నారు.
హుజూర్నగర్ : మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నాగారం :మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో నాయకులు ఆ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ ఆకుల బుచ్చిబాబు, కన్నబోయిన వెంకటభిక్షం, ఎల్మకంటి సోమన్న ఉన్నారు.
మద్దిరాల: మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అరెస్టయిన వారిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్త కృష్ణమూర్తి, నలమాస ఉపేందర్, అనిల్, గొలుసుల ఉపేందర్, కాశయ్య, ఉమేష్, సాయి, సుబ్బు ఉన్నారు.
పెన్‌పహాడ్: మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.స్టేషన్ ఎదుట నాయకులు నిరసన తెలిపారు.అరెస్టయిన వారిలో రాంబాబు, లక్ష్మణ్‌బాబు, వగ్గు శంకరయ్య, సత్తిరవీందర్, ఒగ్గు రవి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.