Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
ఉపాధిహామీకూలీలను కులాలవారీగా విభజన చేసి వేతనాలను ఇవ్వాలనే ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని, దీనిని నిరసిస్తూ ఈ నెల 26న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు కోరారు.గురువారం మండలకేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కులాల వారీగా ఉపాధి కూలీల వేతనాలు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీచట్టంలో పని చేస్తున్న కూలీలను కులాలవారీగా విభజన చేసి వేతనాలు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నారు.ప్రతి ఒక్కరికీ కులం,మతం,ప్రాంతం,లింగ వివక్ష లేకుండా పని కలిపించాలనే చట్టం స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య అన్నారు.ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆడ,మగ తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టం డైరెక్షన్‌ను తూట్లు పొడుస్తుందని విమర్శించారు. దళితులకు ఉప ప్రణాళిక కేటాయింపులు ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పడం మోసమేనన్నారు.ఈ సమావేశంలో సీఐటీయూ మండల అధ్యక్షులు గుంటగాని ఏసు, రైతుసంఘం మండల ఉపాధ్యక్షులు మైనంపాటి వెంకట్‌రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు చర్లపల్లి మల్లయ్య,గురజాల నాగయ్య, డీివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి బూడిద లింగయ్య, ఐద్వా మండల నాయకురాలు వెంకటమ్మ పాల్గొన్నారు.