Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేశ ప్రజల ప్రాథమిక హక్కైన వ్యక్తిగత గోప్యతకు తూట్లు పొడుస్తున్నమోడీ సర్కారు ''పెగాసెస్'' కు వ్యతిరేకంగా నేడు ఏఐసీసీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ ఆదేశం మేరకు చలో రాజ్ భవన్ కు బయలుదేరుతున్నదేవరకొండ కాంగ్రెస్ పార్టీ నేతలను దేవరకొండ సీఐ ఆదిరెడ్డి ముందస్తు అరెస్ట్ చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో డీసీసీ కార్యదర్శి లెండల మోహన్‌రావు, పట్టణాధ్యక్షుడు యూనూస్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతకుంట్ల సత్యం, డీసీసీ సహాయ కార్యదర్శి వైఎస్ కరుణాకర్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్‌నాయక్, మాజీ కౌన్సిలర్ అమర్, అజర్, శ్రీను, సతీష్, రాజేష్, యాదయ్య.తదితరులు ఉన్నారు.
మిర్యాలగూడ :ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ తలపెట్టిన చలో రాజ్‌భవన్‌కు తరలివెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తున్న నాయకులను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ పెగాసెస్‌తో కాంగ్రెస్ నేతల ఫోన్లలోకి చొరబాటు అయి వ్యక్తిగత గోప్యతకు మోడీ సర్కార్ భంగం కల్గిస్తుందన్నారు.టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలను గద్దె దించే వరకూ కాంగ్రెస్ ప్రజలపక్షాన పోరాటం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, గంధం రామకష్ణ, చల్లా వెంకన్న, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, రామచంద్రయ్య, మంద పద్మ పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్ అన్నారు.రాజ్‌భవన్ ముట్టడికి తరలివెళుతున్న యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
పెద్దవూర :మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పబ్బు యాదగిరి, మండల యూత్ అధ్యక్షుడు కిలారి మురళీకృష్ణ, ఊరే వెంకన్న, పున్రెడ్డి రామన్న, కర్నాటి మధు ఉన్నారు.
తిరుమలగిరి:పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు రాజ్‌భవన్‌కు తరలివెళ్లకుండా ముందుస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్, ఎన్ఎస్యూఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేద్కర్, మున్సిపల్ కౌన్సిలర్లు భాస్కర్, హనుమంతు, నాయకులు కృష్ణ, తిరుమలేష్ ఉన్నారు.
తిరుమలగిరిసాగర్ : మండలంలోని కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో కలసాని చంద్రశేఖర్, నెమలి శ్రీధర్‌రెడ్డి, చిట్టి వెంకటేశ్వర్లు, వెంకన్న, పృధ్వీరాజ్, భిక్షపతి, కృష్ణానాయక్,లాలునాయక్,మునినాయక్,బద్రీనాయక్,నాగేందర్, బిక్కు, హచ్చునాయక్, పాండురంగా,తారాసింగ్, సర్దార్, బిచ్యాలు, విజరు,నాగేశ్వరరావు,రాజు, రమేశ్ ఉన్నారు.
అనంతగిరి : మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టుచేశారు.అరెస్టయిన వారిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, అమీనాబాద్ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు, వైస్‌ఎంపీపీ రామ,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చిలక ముడీ శ్రీనివాసరావు, కష్ణనాయక్, జొన్నలగడ్డ కోటేశ్వరరావు, వీరయ్య, రామారావు ఉన్నారు.
కొండమల్లేపల్లి: అక్రమ అరెస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాలను ఆపలేరని కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు అన్నారు.కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో సుమన్, రమేశ్ ఉన్నారు.