Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని మునిపంపుల గ్రామంలోని మునీశ్వర గుట్ట చుట్టూ ఉన్న బాటను కొందరు కబ్జా చేసినవారనిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల కమకిటీ సభ్యులు యాదాసు యాదయ్య కోరారు. గురువారం ఆ గ్రామంలో పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బాటను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామస్తుల ఆరాద్య దైవం అయిన మునిశ్వర గుట్ట చుట్టూ ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా బండ్లు కట్టి తిప్పటం ఆనవాయితీగా ఉందన్నారు. గ్రామంలో వందల ఏండ్లుగా నడుస్తున్న బాటలను కబ్జాలు చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో గ్రామంలో భూములు కొనుగోలు చేసి గ్రామ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. రెవిన్యూ అధికారులు స్పందించి చొరవ తీసుకుని గ్రామానికి సంబంధించిన ఆలయ బాటను గుర్తించి, కబ్జా చేసిన వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి తాళ్ళపల్లి జితేందర్, నాయకులు బూడిద భిక్షం, జోగుల శ్రీనివాస్, ఎండి.మైనోద్దిన్, గునుగుంట్ల సత్యనారాయణ, ఉండ్రాతి నర్సింహ, గంటెపాక శివ కుమార్, ఆకుల ఉపేందర్, పులిపలుపుల శివ కుమార్, పల్లె బాలకష్ణ, కూనూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.