Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నిడమనూరు మండలం ముప్పారం దళిత కుటుంబాలకు చెందిన భూమిని ఆక్రమించొద్దంటూ కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొజ్జ చిన్నమాదిగ మాట్లాడారు.నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో సర్వే నెం: 153లో ఐదెకరాల భూమిని దళిత కుటుంబాలకు చెందిన వారు సేద్యం చేసుకుంటున్నారన్నారు.కానీ ప్రభుత్వం పల్లెప్రగతి వనం పేర బలవంతంగా ఆక్రమించుకోవాలని చూస్తుందన్నారు.స్థానిక అధికార పార్టీ నాయకులు రాజకీయ కక్షతో స్థానిక అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.వారి భూమిని ఆక్రమించుకోవాలని చూస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.వినతిపత్రం అందజేసిన వారిలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పరుశరాములు, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు ముదిగొండ వెంకటేశ్వర్లు, కోటేశ్ ఉన్నారు.