Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ - సూర్యాపేట
ఉపాధి హామీ కూలీలను కులాల వారిగా విభజించి వేతనాలు ఇవ్వాలనే ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడ, మగ అనే తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే చట్టం డైరెక్షన్‌ను తూట్లు పొడవడం సరికాదన్నారు. దళితులకు ఉప ప్రణాళిక ప్రకారం కేటాయింపులు ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పడం మోసమే అన్నారు. కరోనాతో పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్మికులు గ్రామాలకు వెళ్తున్నారని, అందరికీ పని కలిపించాలంటే ఉపాధి పని దినాలు పెంచాలని, ఉపాధిహామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలని, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, మాల మహానాడు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు ఎర్రమల రాములు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హుస్సేన్, సీపీఐఎంఎల్ రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమా శంకర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు ఎమ్‌డి. ఫక్రుద్దీన్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, తెలంగాణ జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు మాండ్ర మల్లయ్యయాదవ్, ఏఐటీయుసి జిల్లా కార్యదర్శి దంతాల రాంబాబు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎల్గూరి గోవింద్, సీఐటీయూ నాయకులు మామిడి సుందరయ్య, వల్లపుదాసు సాయికుమార్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జంపాల స్వరాజ్యం, ఏఐటీయూసీ పట్టణ నాయకులు గాలి కృష్ణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు పిండిగ గోపి తదితరులు పాల్గొన్నారు.