Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
రక్షణరంగంలో ప్రయివేటీకరణ విధానాలను మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మలవీరారెడ్డి కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.శుక్రవారం సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఎంవీఎన్ విజ్ఞానకేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేట్‌పరం చేస్తుందని విమర్శించారు.రక్షణరంగాన్ని కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందన్నారు.ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఆందోళనలకు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర డిఫెన్స్ సర్వీస్ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు జరిగే పోరాటంలో ఉద్యోగ,కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ ,జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు మల్లుగౌతంరెడ్డి, వంటెపాక వెంకటేశ్వర్లు, అద్దంకి నర్సింహ, బీమగాని గణేష్, పోలే సత్యనారాయణ, పార్వతి ,తాడ్వాయిరాములు, నర్సారెడ్డి, రమణ, ఎల్లయ్య పాల్గొన్నారు.