Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
నియోజకవర్గంలోని జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దష్టికి తీసుకెళ్తానన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్, హెల్త్‌కార్డులు,ఇండ్ల స్థలాల మంజూరుకు కషి చేస్తానన్నారు.ు జర్నలిస్టులు సమాజంలో జరిగే దోషాలను ప్రజలకు తెలియజేసే విధంగా, సమాజంలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉత్తమవార్తలను రాయాలన్నారు. అభూత కల్పనలతో వార్తలు రాసి తమకున్న విలువలను తగ్గించుకోవద్దన్నారు.ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చే వార్తలను రాయాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చేవిధంగా ఉండాలన్నారు.ఈ సమావేశంలో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నాయకులు కోలా నాగేశ్వరరావు, హుజూర్నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాచేపల్లి దయాకర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు తూముల వెంకటేశ్వర్లు, జర్నలిస్టులు పిల్లల మర్రి శ్రీనివాస్, శ్రీనివాసచారి, డి.శేషంరాజు, దేవరం రామిరెడ్డి, డి.కతరామనాథం , ఇందిరాల వెంకట్రామ్, ఇట్టిమల్ల రామకష్ణ, దేవరం వెంకట్‌రెడ్డి, భాస్కర్, సీహెచ్.రమేశ్ పాల్గొన్నారు.