Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షంగౌడ్
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ సంఘం సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించి మాట్లాడారు.సీపీఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యా యుల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అపరిష్కతంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి నిరంజన్‌రెడ్డి,గౌరవ అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాసులు,మాజీ జిల్లా కార్యదర్శి బసిరెడ్డి రవీందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కవిత, మేకల జాన్‌రెడ్డి, విజనగరం శ్రీనివాస్, రాష్ట్ర బాధ్యులు రాజవర్థన్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, జిల్లా బాధ్యులు గంగాధర్, కవిత, మండల అధ్యక్ష కార్యదర్శులు సూదిరెడ్డి రవీందర్‌రెడ్డి, చిక్కుల మదనయ్య, ఇద్దయ్య, రూపని వెంకన్న,సామ రామచంద్రారెడ్డి, జడల వెంకన్న, సీనియర్ నాయకుడు గాయం నర్సింహారెడ్డి, మైనంపాటి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.