Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ డీజీపీ శశిధర్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ప్రభుత్వం పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, సిబ్బంది కూడా మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలను పొందాలని అడిషనల్ డీజీపీ శశిధర్రెడ్డి అన్నారు.శుక్రవారం నల్లగొండ ప్రాంతంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్లో టీఎస్ఎస్పీలకు నిర్వహించిన శిక్షణా ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరని, ఉద్యోగాలు సాధించిన వారు రాగధ్వేషాలకతీతంగా పనిచేయాలని సూచించారు.బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య మాట్లాడుతూ నిష్ణాతులైన శిక్షకుల చేత శిక్షణ పూర్తి చేశామన్నారు.2004 నుంచి ఇప్పటివరకు 23 బ్యాచ్లకు శిక్షణ విజయవంతంగా పూర్తి చేశామన్నారు.అనంతరం నిర్వహించిన బ్యాండ్ టీమ్ ప్రదర్శన, ఇతర డెమోలు ఆకట్టుకున్నాయి.