Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నవతెలంగాణ -రామన్నపేట
టీఆర్ఎస్ కార్యకర్తలను, బాధల్లో, ఆపదలో ఉన్న ప్రజలను నిరంతరం ఆదుకుంటామని, వారికి అండగా ఉండి కాపాడుకుంటామని స్థానిక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జేపీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు గంగుల వెంకట రాజారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు కష్ణ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గంగుల వెంకట రాజా రెడ్డి సేవా తత్పరత ఉన్న నాయకుడని కొనియాడారు. ఆయన పుట్టిన రోజు వేడుకలకు మండల స్థాయిలో స్వచ్ఛందంగా అభిమానులు తరలి రావడం ఆయన మంచి తనానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూస బాలకిషన్, ఆకారపు మధు బాబు, వనం విట్టల్, రచ్చ లక్ష్మణ్, రామిని రమేష్, యానాల మల్లారెడ్డి, బాల్తు నాగయ్య, జెల్లా వెంకటేశం, ఎండి.అక్రమ్, కొండ బుచ్చిబాబు, ఎంపీటీసీ పూస బాలమణి, బాల నరసింహ, కూనూరు కష్ణ గౌడ్, సుక్క శ్రవణ్ కుమార్, బండ దామోదర్ రెడ్డి, పోతరాజు శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.